top of page
Shiva YT

‘NTRతో వార్‌ కోసం వెయిట్ చేస్తున్నా.’ హృతిక్ సెన్సేషన్ కామెంట్స్..‍🤩

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు తారక్..

అటు నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈమూవీ తర్వాత ఆయన నటిస్తోన్న దేవర సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే అటు హిందీలో వార్ 2 చిత్రంలోనూ తారక్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని బీటౌన్ హీరో హృతిక్ కన్ఫా్ర్మ్ చేశాడు. దీంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ నెట్టింట వైరలవుతుంటాయి. తాజాగా వార్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు హృతిక్.

ఇటీవలే ఫైటర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు హృతిక్. దీపికా పదుకొణే కథానాయికగా నటించగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో అనిల్ కపూర్ కీలకపాత్ర పోషించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హృతిక్.. వార్ 2 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ నెట్టింట వైరలవుతుంటాయి..‍😎

bottom of page