హైదరాబాద్, 25-07-2024 : శశికాంత్ కనపర్తి స్థాపించిన హైదరాబాద్ ఆధారిత రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అత్యవసర సేవలు అందించడంలో వినూత్న ప్రణాళికలతో వోల్టా వినియోగదారులకు మరింత భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా (0% కమీషన్) రైడ్‌లను అందించడంతో పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని, వోల్టాస్టిక్ అనుభవాలను అందించడంలో వోల్టా తన నిబద్ధతకు ప్రదర్శిస్తుంది. ఈ యాప్ లో ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతతో SOS బటన్‌ను చేర్చారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులను టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ టెన్ యొక్క వేగవంతమైన అంబులెన్స్ సేవలకు తక్షణమే కనెక్ట్ చేయడానికి రూపొందించబడింది. కేవలం ఒక క్లిక్ తో ఈ ఫీచర్ సహాయం ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ సేవలను అందిస్తుంది.
టెన్.., హైదరాబాద్‌లో ఉన్న ఒక మార్గదర్శక అత్యవసర ప్రతిస్పందన సేవ. ఇది నగరంతో పాటు ఆరు మెట్రో నగరాల్లో పనిచేస్తుంది. కేవలం 15 నిమిషాల సకాలంలో అంబులెన్స్ సేవలను అందించడం వీరి ప్రత్యేకత.
దీనికి సంబదించి టెన్ సర్వీసెస్ MD వెంకట కిషోర్ బాబు మానేపల్లి మాట్లాడుతూ... "వేగవంతమైన, నమ్మదగిన అత్యవసర సహాయాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యం. 650 అంబులెన్స్‌ల అత్యవసర సేవలతో 4,500 మందికి పైగా ప్రాణాలను కాపాడిన ట్రాక్ రికార్డ్ మా సొంతం. మేము మా పరిధిని విస్తరించడంతో పాటు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాము. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించి కేవలం 7 నిమిషాల్లో అంబులెన్స్ ను స్పాట్ కు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. మనుగడ రేటును పెంచడానికి దీనిని వైద్య పరిభాషలో 'గోల్డెన్ అవర్' అని పిలుస్తార"నీ ఆయన తెలిపారు.
వోల్టా వ్యవస్థాపకుడు శ్రీ శశికాంత్ కనపర్తి మాట్లాడుతూ.., “ఈ సహకారం ప్రజల భద్రతను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. వినియోగదారు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే అధునాతన ఫీచర్‌లను సమగ్రపరచడంలో వోల్టా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. వోల్టా ఆధ్వర్యంలోని వినూత్న రైడ్-హెయిలింగ్ సొల్యూషన్‌లను టెన్ సంస్ధ నిపుణుల అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలతో కలపడం ద్వారా..., ఈ భాగస్వామ్యం అత్యవసర ప్రతిస్పందన మరియు రైడ్-హెయిలింగ్ సేవల్లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుంద"ని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి యాప్ SOS ఫీచర్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ సేవలతో రైడ్ హెయిలింగ్ యాప్ సంస్థ సహకరించడం దేశంలో ఇదే తొలిసారి అని వోల్టా సీఈవో 'రాజా విక్రమ్' తెలిపారు. వోల్టా లోని యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన వినియోగదారులందరికీ SOS ఫీచర్ అందుబాటులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్లు లేదా వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.