top of page

వోల్టా-వార్కస్ భాగస్వామ్యం - రాబోయే 5 సంవత్సరాల్లో లక్ష EV స్కూటర్‌ల తో అర్బన్ మొబిలిటీ EV స్కూటర్స్ ఒప్పందం.


హైదరాబాద్, [30 ఆగస్ట్ 2024] – శశికాంత్ కనపర్తి స్థాపించిన వినూత్న రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, CEO రాజా విక్రమ్ నేతృత్వంలో, ప్రముఖ EV స్కూటర్ తయారీదారి సంస్థ వార్కస్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు . వీరు వచ్చే ఐదేళ్లలో వోల్టా ఫ్లీట్‌లోకి లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టనున్నారు . ఈ సందర్భం గా CEO రాజా విక్రమ్ మాట్లాడుతూ రైడ్-హెయిలింగ్ మార్కేట్ లో వోల్టా ఒక EV ఎకోసిస్టమ్ రూపొందిస్తూ EV ప్రయోజనాలను వినియోగదారులకు మరియు పర్యావరణానికి మరింత ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని తెలియచేశారు. ఈ పర్యావరణ అనుకూల వాహనాలు వోల్టా యొక్క రైడ్-హెయిలింగ్ కస్టమర్‌లు మరియు పార్సల్ సేవలకు ఉపయాగించనున్నారు .

వార్కస్ వ్యవస్థాపకులు మరియు సీఈవో అయిన శ్రీ రామ్ వేమిరెడ్డి గారు ఈ భాగస్వామ్యం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, పట్టణ ప్రయాణాన్ని మరింత పరిశుభ్రంగా మరియు మరింత సమర్థవంతంగా చేయడానికి ఇది ఒక తొలి అడుగు అని పేర్కొన్నారు. వార్కాస్ యొక్క COO Mr. LN రావు గారు , ఈ సహకారం పర్యావరణంపై దృష్టి పెట్టుకొని మరియు ప్రయాణికుల జీవితాలను, కాలుష్యం ని మెరుగుపరచడంలో వోల్టా యొక్క మిషన్‌కి ఈ భాగస్వామ్యం సంపూర్ణం చేస్తుంది అని తెలిపారు.

వోల్టా లో తక్కువ చార్జీలు , సౌకర్యవంతమైన, పారదర్శక ధరలకు సేవలు అందించె సంస్థగా ప్రసిద్ధి చెందింది. డిజిటల్ మీటర్లు, డ్రైవర్‌లకు జీరో కమీషన్ మరియు ఎమర్జెన్సీ SOS వంటి ఫీచర్‌లతో, వోల్టా వినియోగదారులు మరియు డ్రైవర్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకు కట్టుబడి ఉంది.ఈ భాగస్వామ్యంతో రవాణా భవిష్యత్తు పట్ల వోల్టా యొక్క అంకితభావాన్నితెలియచేస్తుంది . Mr. రామ్ వేమిరెడ్డి మరియు Mr. LN రావు నాయకత్వంలో వార్కాస్, ఆధునిక పట్టణ జీవన అవసరాలకు అనుగుణంగా అధిక-పనితీరు గల స్కూటర్‌లను ఉత్పత్తి చేస్తూ ఎలక్ట్రిక్ వాహన విప్లవంలో అగ్రగామిగా కొనసాగుతోంది.

వోల్టా మరియు వార్కస్ ల మధ్య ఈ సహకారం హైదరాబాద్‌లో మరియు రైడ్-హెయిలింగ్ పరిశ్రమలో మరియు పార్సెల్ డెలివరీ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్వచించటానికి సెట్ చేయబడడమే కాకుండ పర్యావరణాన్ని కాపాడటానికి మరియు రవాణా ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది .

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page