top of page
MediaFx

సౌందర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా..


సౌందర్య ఈ పేరును , ఆమె రూపాన్ని తెలుగు ప్రేక్షకులు అంత సులువు మర్చిపోలేరు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. సౌందర్య నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది సౌందర్య. ఎన్ని భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సౌందర్య. అభిమానులను ప్రేక్షకులను శోకసంద్రంలో ముంచేసి హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసింది సౌందర్య. 100 కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో అమ్మోరు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

అయితే సౌందర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. సౌందర్య రూపానికి, నటనకు తగ్గట్టు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? ఆమె పేరు శిల్ప. ఆ శిల్ప ఎవరో కాదు ఆమె కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారే.. ఆమె చాలా సినిమాల్లో కూడా నటించింది. అలాగే చాలా మందికి డబ్బింగ్ కూడా చెప్పింది. అలాగే ఇన్నో సినిమాల్లో సౌందర్యకు అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది శిల్ప. ఆమె నటుడు మహర్షి రాఘవ సతీమణి. సౌందర్యతో పాటు చాలా మంది హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పింది ఆమె. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడారు. అలాగే ;సౌందర్య డైలాగ్ కూడా చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



bottom of page