top of page
MediaFx

వైజాగ్ జంట వెడ్డింగ్‌ కార్డు ఐడియా అదుర్స్..


వెడ్డింగ్‌ కార్డు కేవలం ఆహ్వానం మాత్రమే కాదు. ఇది దంపతుల అభిరుచికి ప్రతిబింబం. ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో కొందరు తమ అభిరుచికి తగ్గట్టు వెరైటీగా కార్డులను డిజైన్‌ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైజాగ్‌కు చెందని ఎ జంట ఐఫోన్ నేపథ్యంతో ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికను రూపొందిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అచ్చం ఐఫోన్‌ మాదిరి ఉన్న వెడ్డింగ్‌ కార్డులను చూడొచ్చు. ఇందులో మూడు పేజీలు ఉన్నాయి. బుక్‌లెట్ లేఅవుట్‌తో డిజైన్‌ చేసిన ఈ ఫోన్ వెడ్డింగ్‌ కార్డులో కవర్ పేజీలో వాల్‌పేపర్ లాగా ఈ జంట ఫోటో ‘బ్యాక్‌గ్రౌండ్’లో కనిపిస్తుంది. ఫోటో పైన వివాహ సమయం, తేదీ వివరాలు స్క్రీన్‌పై చూపిస్తున్నట్ల వీడియోలో కనిపిస్తుంది. లోపల పేజీలలో ఒకదానిపై వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మాట్ ఉంటుంది.సెండ్ లొకేషన్ క్యాప్షన్‌తో వివాహ వేదిక వివరాలు కనిపిస్తాయి. ఇక ఇన్విటేషన్ ‘బ్యాక్ కవర్’ అద్భుతమైన కెమెరా ఇలస్ట్రేషన్‌తో 3డీ మాదిరిగా డిజైన్ చేసి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యూస్‌, 6 లక్షలకుపైగా లైకులు, కామెంట్లు రావడంతో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఐడియా బలేగుంది గురూ.., ‘చాలా ఖరీదైన వెడ్డింగ్ కార్డ్’, ‘మీ ఆలోచనను అభినందిస్తున్నాను’, ‘బాస్.. నీ క్రియేటివిటీ అదిరింది’ అంటూ నెటిజన్లు పొగత్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..!

bottom of page