top of page

విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

'మార్క్ ఆంటోనీ' హిందీ వెర్షన్ రిలీజ్ కోసం CBFC అధికారులు 6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్టు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లంచం అడిగారంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) ఆఫీస్ లో తనకు స్వయంగా ఈ అనుభవం ఎదురయిందన్నారు. సినిమా సర్టిఫికేషన్ కు లంచం తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ లంచం వ్యవహారాన్ని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

రిత్వ శాఖ స్పందించింది. “CBFCలో సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం అడగడం అత్యంత దారుణం. విశాల్ కు ఎదురైన ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు. ఈ లంచం వ్యవహారం వెనుక ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారి ఈరోజే విచారణ కోసం ముంబైకి పంపించాం. త్వరలోనే బాధ్యులపై చర్యలుంటాయి. CBFC ద్వారా వేధింపులు ఎదరైతే jsfilms .inb@nic.in ద్వారాసమాచారం ఇవ్వండి. తగిన చర్యలు తీసుకుంటాం” అని వెల్లడించింది.


コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page