top of page

కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. 🏏

భారత ఓపెనర్లుగా రోహిత్, శుభమాన్ జట్టుకు శుభారంభం అందించారు. అయితే రోహిత్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 94 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేయడంతో పాటు అజేయమైన సెంచరీని నమోదు చేశాడు. 🌟

అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతగా నిలిచాడు. 🏆ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఆసియా కప్ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. 🥇నిజానికి పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, మాజీ కెప్టెన్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ తలో 3 అవార్డులతో అగ్రస్థానంలో ఉండేవారు. 🥈🥉🥉కానీ పాక్‌పై అజేయంగా 122 పరుగులు చేసిన కోహ్లీ నాలుగో అవార్డను గెలుచుకోవడం ద్వారా ప్రధమ స్థానంలోకి ప్రవేశించాడు. దీంతో రైనా, సిద్ధూను రెండో స్థానంలోకి దిగారు. 🏆కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్‌పై విజయం సాధించింది. 🇮🇳🏏🇵🇰

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page