top of page

చెత్త రికార్డులో కేఎల్ రాహుల్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ

అమెరికా మరియు వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ, అమెరికాపై మ్యాచ్‌‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ వేసిన ఓవర్‌లో తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీ20లలో కోహ్లీ 6వసారి డకౌట్ అయ్యాడు.

టీ20లలో ఎక్కువ సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు:

  1. రోహిత్ శర్మ - 12

  2. విరాట్ కోహ్లీ - 6

  3. కేఎల్ రాహుల్ - 5

టీ20 వరల్డ్ కప్‌లలో గోల్డెన్‌ డక్‌ అయిన భారత ఆటగాళ్ల జాబితా:

  1. దినేష్ కార్తీక్ - 2007 (ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా)

  2. మురళీ విజయ్ - 2010 (ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా)

  3. ఆశిష్ నెహ్రా - 2010 (ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)

  4. సురేష్ రైనా - 2016 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)

  5. రోహిత్ శర్మ - 2021 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)

  6. రవీంద్ర జడేజా - 2024 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)

  7. జస్ప్రీత్ బుమ్రా - 2024 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)

  8. విరాట్ కోహ్లీ - 2024 (ఇండియా వర్సెస్ అమెరికా)

Yorumlar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page