top of page
Shiva YT

మరో రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ , కానీ క్రికెట్ లో కాదు

భారత క్రికెటర్ విరాట్ కోహ్లి నికర విలువ రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించి అత్యంత ధనవంతులైన భారతీయ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచాడు.స్టాక్ గ్రో ప్రకారం, కోహ్లి నికర విలువ రూ.1,050 కోట్లు.

కోహ్లీ తన టీమ్ ఇండియా కాంట్రాక్ట్ ద్వారా ఏటా రూ. 7 కోట్లు సంపాదిస్తాడని, ఒక్కో టెస్టు మ్యాచ్‌కి రూ. 15 లక్షలు, ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్‌కి రూ. 3 లక్షలు అందుకుంటున్నాడని చెబుతున్నారు. టీ 20 లీగ్ ద్వారా ఏటా రూ.15 కోట్లు సంపాదిస్తున్నాడు.బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో, డిజిట్ వంటి స్టార్టప్‌లలో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. కోహ్లి సంపాదనలో కొంత భాగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి వచ్చింది.కోహ్లీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు వివో , మింత్రా , బ్లూ స్టార్ , వోలిని , లక్సర్ , HSBC, ఉబర్ , MRF, తిస్సోట్ , సింథాల్ తదితర వాటితో సహా 18కి పైగా ఉన్నాయి.అలాగే అతను ఒక్కో ప్రకటన షూట్‌కు రూ. 7.50 నుండి 10 కోట్ల వరకు రుసుము వసూలు చేస్తున్నట్లు సమాచారం. అతనికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా రూ. 175 కోట్లు వచ్చాయి.సోషల్ మీడియాలో కోహ్లి కి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో ఒక్కో పోస్ట్‌కు కోహ్లి రూ.8.9 కోట్లు, రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.అతను One8, రెస్టారెంట్, విలాసవంతమైన దుస్తులు కోసం Wrogn వంటి బ్రాండ్‌లను కూడా కలిగి ఉన్నాడు.అతనికి ముంబైలో రూ.34 కోట్లు, గురుగ్రామ్‌లో రూ.80 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. రూ.31 కోట్ల విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

bottom of page