top of page

వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు.. అసలేంటీ ఆ రూల్..


బరువు పెరిగిన వినేష్‌పై అనర్హత, రూల్ ఏంటో తెలుసా?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రెజ్లర్ల బరువు విభాగానికి సంబంధించిన నియమం ఏమిటి, దీని కారణంగా మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకున్న తర్వాత కూడా వినేష్ ఫోగట్‌ను పారిస్ ఒలింపిక్స్ నుంచి  తప్పుకోవాల్సి వచ్చింది? రెజ్లింగ్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం, ఏ రెజ్లర్ అయినా మ్యాచ్ జరిగే రెండు రోజులూ తన వెయిట్ కేటగిరీలోనే ఉండాలి. కానీ, వినేష్ ఫోగట్ బరువు ఆమె కేటగిరీ కంటే 150 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను అనర్హుడిగా ప్రకటించారు. నివేదికల ప్రకారం, సాయంత్రం రెజ్లింగ్ మ్యాచ్ నిర్వహిస్తే, మ్యాచ్ జరిగే రోజు ఉదయం రెజ్లర్ బరువును తూకం వేస్తారు. ఒక రెజ్లర్ తన బరువు కేటగిరీ నుంచి గరిష్టంగా 100 గ్రాముల బరువును పెంచుకోవడానికి అనుమతిస్తారు. కానీ, వినేష్ విషయంలో మాత్రం 100 గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువగా ఉందంట. బరువు పెరిగిన కారణంగా వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌కు అనర్హత వేటు పడింది. దీంతో ఆమెకు ఇప్పుడు ఎలాంటి పతకం రాదు. నిబంధనల ప్రకారం ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల బరువు విభాగంలో కాంస్య, బంగారు పతకాలు మాత్రమే ఇస్తారు. వినేష్ ఔట్ కావడంతో రజత పతకం లభించదు.

గెలిచినా తర్వాత ఓడిపోయిన వినేష్ ఫోగట్..

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల ఈవెంట్‌లో వినేష్‌ ఫోగట్‌ శుభారంభం చేసింది. ఆమె తన మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్స్‌లోనూ దిగ్గజాలకు షాకిస్తూ ఫైనల్‌కు ప్రయాణం సాగించింది. కానీ, ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌ అయిన తీరు.. గెలిచుకుంటూ ఫైనల్ వరకు వచ్చిన ఆమెకు తీవ్రమైన బాధను మిగిల్చింది.



Comments


bottom of page