గణేష్ ఉత్సవాన్ని భక్తులు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గణేష్ ఉత్సవాన్ని గణపతి నవరాత్రులుగా జరుపుకుంటారు. అనంత చతుర్దశి రోజున ఈ ఉత్సవాలు ముగుస్తాయి. . పది రోజులు పాటు జరుపుకునే ఈ గణపతి ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ 2024 నుండి ప్రారంభామై సెప్టెంబర్ 17వ తేదీన ముగుస్తాయి. గణపతి అంటే అన్ని రకాల ఆటంకాలను తొలగించేవాడు. అయినప్పటికీ వాస్తును దృష్టిలో ఉంచుకుని వినాయక చవితి రోజున ఇంట్లో గణపతిని ఉంచినట్లయితే గజాననుడు విశేషమైన ఆశీర్వాదాలను ఇస్తాడని నమ్మకం. ఈ రోజు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు గుర్తుంచుకోవలసిన 5 వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.
రంగుల ఎంపిక: సహజంగా మట్టి వినాయకుడుని పూజించడం అత్యంత శ్రేష్టం. అయితే రంగుల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలుపు రంగు గణపతి విగ్రహాలు గృహాలకు ఉత్తమ ఎంపిక. తెలుపు రంగు శాంతి , స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి శ్రేయస్సు, శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుంది.
భంగిమను జాగ్రత్తగా చూసుకోండి: వాస్తు శాస్త్రం ప్రకారం కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఈ భంగిమ విశ్రాంతి, శాంతిని అందిస్తుంది. ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
గణేశుడి తొండం: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే ముందు వినాయకుడి తొండం ఎడమ వైపుకు వంగి ఉండే విధంగా చూసుకోండి. అటువంటి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని ఇస్తుంది.
గణేశుడిని ప్రతిష్టించే దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని ఇంటికి పడమర, ఉత్తరం , ఈశాన్య మూలల్లో ఉంచాలి. హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు కనుక గణేశ విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉండాలి.