top of page
MediaFx

నాన్న సినిమా చిన్నారి ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందిగా..

ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన నటుడు విక్రమ్, తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో అందరినీ కట్టిపడేశాడు. శివపుత్రుడు సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విక్రమ్, నాన్న సినిమాలో కూడా అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన చిన్నారి బేబీ సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

తమిళ్ లో దైవ తిరుమగళ్ అనే సినిమాను తెలుగులో నాన్న అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. ఈ సినిమా తండ్రి కూతుర్ల కథ. ఈ మూవీలో మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన చిన్నారి బేబీ సారా అర్జున్.

ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాలో యంగ్ ఐశ్వర్య రాయ్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపించి ఆకట్టుకుంది సారా అర్జున్. ఇక ఈ అమ్మడు ఇప్పుడు మరింత అందంగా మారింది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.


bottom of page