విజయ్ లియో సినిమా విషయంలో ఉదయనిధి స్టాలిన్ కాస్త ఒత్తిడి తెస్తున్నాడని, ఆడియో లాంచ్‌కు పర్మిషన్లు ఇవ్వడం లేదని కోలీవుడ్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఓ టాక్ వినిపిస్తోంది. డీఎంకే పవర్‌లో ఉండటంతో ఉదయనిధి స్టాలిన్,అతని సంస్థ రెడ్ గెయింట్ రెచ్చిపోతోందని అనుకుంటున్నారు. ప్రతీ సినిమాలో షేర్,లేదంటే ముఖ్యమైన ఏరియా హక్కులు అడుగుతున్నారట. తమ సంస్థకు హక్కులు ఇవ్వని సినిమాలను ఏదో రకంగా వేధింపులకు గురి చేస్తున్నాడట. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు విజయ్ లియో మీద సైతం రెడ్ గెయింట్ కన్ను పడినట్టుగా కనిపిస్తోంది.
లియో సినిమాకు కొన్ని ఏరియాల హక్కులు కావాలని రెడ్ గెయింట్ అడిగిందట. కానీ బేరసారాలు కుదరకపోవడంతో నిర్మాత నో చెప్పేశాడట. దీంతో లియో ఆడియో ఫంక్షన్‌కు అనుమతి ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ఈ విషయం మీద రకరకాల రూమర్లు వ్యాప్తి చెందాయి. తాజాగా నిర్మాణ సంస్థ ఓ క్లారిటీ అయితే ఇచ్చింది.
జనాలు ఎక్కువ మంది వస్తారని అంచనాతో.. పాస్‌లు ఎక్కువగా ఇవ్వడంతో.. భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని మేం లియో ఆడియోను రద్దు చేయాలని అనుకుంటున్నాం.. అభిమానుల కోరిక మేరకు మేం నిరంతరం అప్డేట్లు ఇస్తూనే ఉంటాం.. అందరూ అనుకుంటున్నట్టుగా.. మా మీద ఏ పార్టీ ఒత్తిడీ గానీ, ఇతర కారణాలేమీ గానీ లేవు అని క్లారిటీ ఇచ్చింది.