top of page

బాలకృష్ణ గారిని ఆ రోజు కౌగిలించుకున్నా

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ నటుడు విజయ్ సేతుపతి షార్ట్ ఫిల్మ్స్ తో మొదలు పెట్టి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. "ఉప్పెన" సినిమాలో తన పాత్రతో తెలుగు సినీ అభిమానులను మెప్పించి, తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారు. తాజాగా ఆయన నటించిన "మహారాజీ" చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

బాలకృష్ణతో కలిసి నటించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు విజయ్ సేతుపతి స్పందిస్తూ, "నాకు బాలకృష్ణ గారి నటన ఎప్పుడూ ఇంప్రెస్ చేసింది. ఆయన ఎలా కెమెరాను హ్యాండిల్ చేస్తారో చూశాను," అని చెప్పారు. చెన్నైలో జరిగిన 100 ఏళ్ల తమిళ సినిమా వేడుకలో ఆయనను కలవడం, ఒకసారి కౌగిలించుకోవడం గుర్తు చేసుకున్నారు.

రామోజీరావు గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, రామోజీ ఫిలింసిటీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2005లో ధనుష్ "పుదుపెట్టై" సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఎక్కువగా షూటింగ్ జరిగిందని చెప్పారు.

తన నటనా ప్రయాణంపై మాట్లాడుతూ, యాక్టర్, స్టార్ ట్యాగ్ మధ్య తేడా లేదని, ఎవరికైనా ఒకటే కష్టం ఉంటుందని అన్నారు. బుచ్చిబాబు ప్యాషన్ నచ్చి "ఉప్పెన" సినిమాలో నటించానని, తెలుగు సినిమాల్లో నటించటం కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నానని తెలిపారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page