top of page

అభిమాన నటుడిని ఇంట‌ర్వ్యూ చేసిన సుహాస్

విల‌క్ష‌ణ న‌టుడు విజయ్ సేతుప‌తి న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘మ‌హారాజ’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌ేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా తెలుగు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా న‌టుడు సుహాస్ విజయ్ సేతుపతిని ఇంట‌ర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను మేక‌ర్స్ విడుదల చేశారు. సుహాస్ తనకు ఇన్స్‌పిరేషన్ విజ‌య్ సేతుప‌తి అని చెబుతూ, తన అభిమాన నటుడిని ఇంట‌ర్వ్యూ చేయడంతో ఈ వీడియోపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు అందరూ పూర్తి వీడియో చూడటానికి ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని నిథిల‌న్ సామినాథ‌న్ దర్శకత్వం వహించగా, అజ‌నీశ్ లోక్నాథ్ సంగీతం అందించారు. మమతా మోహన్ దాస్, అభిరామి, అనురాగ్ కశ్యప​ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయనున్నారు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page