టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో పలకరించారు. దిల్ రాజు, శిరీష్, నిర్మాణంలో టాలెంటెడ్ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో కొత్త మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్‌తో వస్తోంది. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇందులో కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ రక్తంతో నిండిన కత్తితో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో డిఫరెంట్ మూవీగా నిలవడం గ్యారంటీ అని ఈ పోస్టర్ చూస్తూ తెలుస్తోంది. రంగస్థలం తరహాలో పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాను 'రాజా వారు రాణి గారు' సినిమాతో పరిచయమైన రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సినిమా ఓ మోస్తరు విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దిల్ రాజు ఎస్వీసీ సంస్థలో రాబోతున్న 59వ సినిమా ఇది.
విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. రీసెంట్గా 'ఫ్యామిలీ స్టార మూవీతో పలకరించారు. పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారంతో ఈ సినిమా బయ్యర్స్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రెజెంట్ ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొత్తంగా థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇపుడు ఓటీటీ వేదికగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. . మరోవైపు విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా ఇపుడు పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాను డైరెక్ట్ చేసిన రాహుల్ ససాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా విజయ్ దేవరకొండ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు.