top of page

8 ఏళ్ల కెరీర్‌లో 10 పైగా సినిమాలు రిజెక్టెడ్..

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్లు కూడా కాలేదు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళవుతున్నా కూడా ఈయనకు బ్రేక్ వచ్చి మాత్రం ఏడేళ్లు అయిపోయింది. పెళ్లి చూపులు సినిమా నుంచి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్లు కూడా కాలేదు. ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం కావొస్తోన్న కూడా ఈయనకు బ్రేక్ వచ్చి మాత్రం ఏడేళ్లు అయిపోయింది. పెళ్లి చూపులు సినిమా నుంచి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలో నటించాడు. ఆ వెంటనే గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈయన ఖాతాలో పడిపోయాయి.

దాంతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. అయితే ఇంత చిన్న కెరీర్‌లోనే ఈయన 10 సినిమాల వరకు నో చెప్పాడట. అందులో కొన్ని సినిమాలు కథలు నచ్చక.. మరికొన్ని సినిమాలు డేట్స్ కుదరక.. ఇంకొన్ని సినిమాలు కాంబినేషన్స్ సెట్ అవ్వక వదిలేసాడు. అలా విజయ్ దేవరకొండ నుంచి చేజారిన.. ఆయన వదిలేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్: డియర్ కామ్రేడ్ సినిమాను విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడు. అదేంటి అందులో నటించింది ఆయనే కదా అనుకుంటున్నారా.. అది నిజమే.. కానీ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయాలని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదలకు ముందే రైట్స్ తీసుకున్నాడు. అప్పటికే తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో డియర్ కామ్రేడ్ విడుదలైంది. కానీ ఊహించిన ఫలితం రాలేదు. అన్ని భాషల్లోనూ డియర్ కామ్రేడ్ దారుణంగా బెడిసికొట్టింది. భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో హిందీ రీమేక్ చేయాలని కరణ్ జోహార్ ఎంత అడిగిన కూడా విజయ్ దేవరకొండ నో చెప్పాడు.

2. భీష్మ: నితిన్ కెరీర్ కు మళ్లీ ఊపిరి పోసిన సినిమా భీష్మ. 2020లో వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కామెడీ ప్లస్ సేంద్రియ వ్యవసాయం అంటూ మంచి కంటెంట్ తో వచ్చిన భీష్మ రూ. 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నిజానికి ఈ సినిమాను ముందు విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. కానీ ఎందుకో ఈ సినిమా కథ విజయ్ కి పెద్దగా నచ్చలేదు. తన ఇమేజ్ కు సూట్ కాదు అని సున్నితంగా తిరస్కరించాడు విజయ్ దేవరకొండ.

3. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్: తన సినిమాలను రీమేక్ చేసుకోవడానికి విజయ్ ఎప్పుడూ ముందుకు రాలేదు. డియర్ కామ్రేడ్ విషయంలోనే ఇది తేలిపోయింది. అలాగే మరో సినిమాకు కూడా ఈయన నో చెప్పాడు. అదే అర్జున్ రెడ్డి.. తెలుగులో పాత్ బ్రేకింగ్ హిట్ అయిన ఈ సినిమా హిందీలో రీమేక్ చేయాలని సందీప్ రెడ్డి వంగా భావించాడు. అక్కడ కూడా విజయ్ దేవరకొండతోనే చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే ఒకసారి నటించిన సినిమా రీమేక్ లో మళ్లీ నటించడం ఇష్టం లేని విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటించలేనని చెప్పాడు. ఆ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేస్తే అక్కడ సంచలన విజయం సాధించింది.

4. ఇస్మార్ట్ శంకర్: ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో లైగర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ కాంబినేషన్ మూడేళ్ల ముందుగానే చూసేవాళ్ళం. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ కథ ముందు విజయ్ దేవరకొండకు చెప్పాడు పూరి జగన్నాథ్. కానీ ఈ డబుల్ దిమాక్ కథ మన రౌడీ బాయ్ కి అస్సలు నచ్చలేదు. అందుకే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అది మిస్ అయిన కూడా ఇప్పుడు పూరితోనే లైగర్ అంటూ పాన్ ఇండియా సినిమా చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత చేద్దామనుకున్న ‘జనగణమన’ మూవీ కూడా పట్టాలెక్కిందో లేదో లైగర్ దెబ్బకు ఆగిపోయింది.

5. కొరటాల శివ సినిమా: కొరటాల శివతో సినిమా చేయాలనీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వేచి ఉన్నారు. ఆయన ఎప్పుడెప్పుడు కథ చెబుతాడా అని స్టార్ హీరోలు కూడా క్యూలో ఉన్నారు. అలాంటిది ఆయన సినిమా అవకాశం ఇస్తే విజయ్ దేవరకొండ కాదన్నాడు. కొరటాల చెప్పిన కథ ఈయనకు నచ్చలేదు. అందుకే అలాంటి సంచలన దర్శకుడికి కూడా విజయ్ నో చెప్పిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా మళ్లీ కలిసి పని చేస్తాం అంటూ అటు దర్శకుడు కొరటాల శివ ఇటు విజయ్ దేవరకొండ నమ్మకంగా చెబుతున్నారు. ఏదేమైనా కొరటాలకు నో చెప్పడం అనేది ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

6. కరణ్ జోహార్ స్ట్రెయిట్ హిందీ సినిమా: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు ఒకసారి కాదు రెండుసార్లు షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఈయనకు వచ్చిన గుర్తింపు మామూలుగా లేదు. ఆ సమయంలోనే విజయ్ ను బాలీవుడ్ కు పరిచయం చేయాలని మ్యాగ్జిమం ట్రై చేశాడు కరణ్ జోహార్. తానే నిర్మాతగా మారి ఒక భారీ సినిమా చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో విజయ్ హ్యాండ్ ఇచ్చాడు. తనకు ఆ కథ నచ్చలేదు అంటూ బయటికి వచ్చేశాడు. అయినా కూడా కరణ్ జోహార్ తో మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ సినిమాను ఆయన హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా.

7. ఆర్ఎక్స్ 100: కార్తికేయ కెరీర్ కు గట్టి పునాది వేసిన సినిమా ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఆర్ఎక్స్ 100 సినిమా కథ తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు చెప్పారు ఈ దర్శకుడు. అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఆయన కంటే ముందు శర్వానంద్ కు కూడా చెప్పాడు. కానీ ఈ కథ వాళ్లకు నచ్చలేదు. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ నో చెప్పారు. అయితే అదే సినిమాను కార్తికేయతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లోనే ఈ కథ కూడా ఉందంటూ రిజెక్ట్ చేసాడు.

8: ఉప్పెన: ఉప్పెన సినిమా కథ కూడా ముందు విజయ్ దేవరకొండకే చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. అయితే ఇది ఇప్పుడు కాదు జరిగింది. కొన్నేళ్ల కింద.. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నపుడు.. విజయ్ స్టార్ కానప్పుడు తన ఉప్పెన కథను విజయ్ కు చెప్పాడు బుచ్చిబాబు. కానీ ఈ రెండు మూడేళ్లలోనే విజయ్ రేంజ్ మామూలుగా పెరగలేదు. దెబ్బకు ఈయన స్టార్ అయిపోయాడు. ఉప్పెన కథకు విజయ్ దేవరకొండ దూరం అయిపోయాడు. ఇమేజ్ వచ్చేసరికి ఈ కథలో ఆయన్ని ఊహించుకోలేకపోయాడు బుచ్చిబాబు. అలాగే విజయ్ కూడా ఉప్పెన కథను కాదన్నాడు. అదే వైష్ణవ్ తేజ్ కెరీర్ కు వరంగా మారింది.

9. హీరో: హీరో అనే సినిమాను మొదలు పెట్టి ఆపేసాడు విజయ్ దేవరకొండ. అప్పట్లో తమిళ దర్శకుడు ఒకరు ఈ సినిమాను తెరకెక్కించాలని పూజా కార్యక్రమాలు కూడా చేసారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను రూపొందించాలని భారీ బడ్జెట్ కూడా ప్లాన్ చేసారు. అయితే అప్పుడే విజయ్ నటించిన బై లింగువల్ సినిమా నోటా వచ్చి డిజాస్టర్ అయింది. దానికితోడు హీరో సినిమాకు బడ్జెట్ కూడా ఎక్కువ డిమాండ్ చేయడంతో ఈ సినిమాను పక్కన బెట్టేసారు. అలా ఈ సినిమా నుంచి కూడా బయటికి వచ్చేసాడు విజయ్ దేవరకొండ.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page