top of page
Shiva YT

🎬🌟 సినిమాలపై విజయ్ దళపతి సంచలన నిర్ణయం!! 🌟🎬

🎥 కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాల్లో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

సొంత పార్టీని కూడా ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దళపతి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దళపతి విజయ్ సినిమా గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది . ‘దళపతి 69’ తర్వాత కూడా రెండు సినిమాల్లో నటించబోతున్నాడట. ప్రస్తుతం విజయ్‌ తన 68వ చిత్రం ‘గోట్‌’తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. దీని తర్వాత దళపతి విజయ్ తన 69వ సినిమా పనుల్లో నిమగ్నంకానున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌, అట్లీలది హిట్‌ కాంబినేషన్‌. గతంలో తేరీ ( తెలుగులోపోలీసోడు), మెర్సల్‌ (అదిరింది), బిగిల్‌ (విజిల్‌) లాంటి సూపర్ డూపర్‌ హిట్లు ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కాయి. ఇప్పుడు వీరు నాలుగోసారి జతకట్టనున్నారని సమాచారం. 69వ సినిమా పూర్తయిన తర్వాత కొన్ని చిత్రాల్లో విజయ్‌ అతిధి పాత్రలో నటిస్తాడని సమాచారం. అయితే సినిమాల్లో నటించడంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు విజయ్‌. 🌟🎥

Comments


bottom of page