top of page
MediaFx

జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోనీ

👣 బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ, తన రాబోయే సినిమా తుఫాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పులు లేకుండా కనపడ్డారు. దీనిపై ప్రశ్నించగా, విజయ్ ఆంటోని సమాధానమిస్తూ, "చెప్పులు లేకుండా బాగానే ఉంది. మొదట్లో కొంచెం పెయిన్ ఉంటుంది. తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. జీవితాంతం ఇలాగే చెప్పులు లేకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను" అన్నారు.కొన్ని నెలల క్రితం కూతురు మరణించిన తర్వాత, విజయ్ ఆంటోని జీవితంపై చాలా మార్పులు చేసుకున్నారు. ఆయన ఇప్పుడు వేదాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ barefoot నిర్ణయం కూడా ఆ క్రమంలో తీసుకున్నారేమో అనిపిస్తుంది.

bottom of page