top of page
Suresh D

వైభవంగా వెంకటేశ్ కుమార్తె వివాహ వేడుక🎉💍

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్‏తో ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు వెంకటేశ్ కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 🎉💍


bottom of page