top of page

ప్రముఖ ఓటీటీలో... ఈరోజు నుంచి సైంధవ్ స్ట్రీమింగ్‌🎥🎞️

హీరో వెంకటేష్, కుర్ర దర్శకుడు శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ అనే ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఓకే అనిపించింది. ఇక తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.🎥🎞️

హీరో వెంకటేష్ ఆ మధ్య ఎఫ్3తో వచ్చి తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌‌ చేశారు. ఇక తాజాగా వెంకీ, హిట్ సిరీస్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఓకే అనిపించుకుంది.ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో  ఈ సినిమా  ఫిబ్రవరి 3నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈరోజు నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.ఈ సినిమాలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ కీలకపాత్రలో నటించారు. హీరోగా వెంకటేష్‌కు ఇది 75వ సినిమా. అందుకే ఈ సినిమాపై వెంకటేష్ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమాలో కీలకపాత్రలో హిందీ నటుడు నవాజ్జుద్దీన్ సిద్ధిఖీ  నటించారు. ఈ సినిమాను నాని‌తో శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, విజయాన్ని అందుకున్న వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించారు. సంతోష్ నారయణ్ సంగీతం అందించారు.  ఇక వెంకటేష్ నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. వెంకటేష్ ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఓరి దేవుడాలో ఓ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.  

ఇక వెంకీ అంతకు ముందు ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చింది. అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ముందు వెంకీ నారప్ప, దృశ్యం2 వంటి సినిమాలతో ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానాతో కలసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్‌లో  వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి. ఈ వెబ్ సిరీస్‌ను  మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.🎥🎞️

bottom of page