top of page

4.7 కోట్ల ఏళ్ల నాటి భారీ పాముకి వాసుకి పేరు ఎందుకు పెట్టారు..?🐍

2005లో గుజరాత్‌లో గుర్తించిన పాము శిలాజాల గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టిన ఈ శిలాజాలు భూమిపైన తిరిగిన అతి పెద్ద పాము అవుతుంది. 4.7 కోట్ల సంవత్సరాల క్రితం కచ్ అడవుల్లో సంచరించిన ఈ పాము పొడవు 36-50 అడుగులుగా, బరువు 1000 కిలోలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది Titanoboa జాతి పాముల తరవాతి తరానికి చెందినది కావచ్చు. దీని పొడవు 42 అడుగుల కన్నా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పొడవైన పైథాన్ పాము 33 అడుగుల పొడవు కలిగి ఉంది.

ఈ పాములు అనకొండ, పైథాన్స్‌లాగా క్షణాల్లో వేటాడి తినేవని, ఆ సమయంలో ప్రమాదకర ఉష్ణోగ్రతల నుండి చల్లదనం కోసం చిత్తడి నేలల్లో తిరిగేవని గుర్తించారు. హిందూ పురాణాల ప్రకారం శివుని మెడలో ఉన్న వాసుకి పాముకు ఈ అరుదైన పాముకు ఆ పేరు పెట్టారు. వాసుకి అంటే పాములకు రారాజు అని పురాణాల్లో ఉంది. ఇప్పుడు గుర్తించిన పాము కూడా భారీగా ఉండడం వల్ల అదే పేరు పెట్టారు.

గుర్తింపు మరియు పరిశోధన

ఈ వాసుకి ఇండికస్ పాము శిలాజాలను IIT-Roorkee ప్యాలియోంటాలజీ ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్ 2005లో కచ్ బొగ్గు గనిలో కనుగొన్నారు. మొదటివాటిని మొసలి శిలాజాలుగా భావించారు. తన లేబరేటరీలో పరిశోధన కోసం 2022 వరకూ ఉంచారు. ఆ తరవాత దత్త అనే మరో సైంటిస్ట్‌తో కలిసి ఈ శిలాజాలపై పరిశోధన చేశారు. వీటికి Titanoboa పాముకి పోలికలు కనిపించాయని చెప్పారు. ఆకారంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ఆ జాతికి కొనసాగింపుగా ఈ పాములు పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page