top of page
Shiva YT

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‏మెంట్ డేట్ ఫిక్స్..

మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.


మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వీరిద్దరు జూన్ 1న హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ తర్వాత వీరిద్దరి నిశ్చితార్థంపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.వరుణ్ తేజ్ ఇటీవల ఇటలీలోని రోమ్ నుండి ఫోటోలను పోస్ట్ చేసాడు. ఇక లావణ్య కూడా తాను పర్యటనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వీరిద్దరు కలిసే ప్రయాణాలు చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరి నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయ్యిందంటూ టాక్ బయటకు వచ్చింది.ఇదిలా ఉంటే.. వీరిద్దరు కలిసి మిస్టర్ మూవీ చేశారు. డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.




bottom of page