top of page

🚆 కశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందే భారత్‌ రైలు.. 🌄

📢 ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రైల్వేలైను విద్యుదీకరణ పనులు పూర్తయిన వెంటనే అక్కడ కూడా వందే భారత్ రైలు దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. 🌟

వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం 75 రైళ్లను పట్టాలు ఎక్కించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. 🚀 అలాగే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యామ్నాయంగా సుదూర ప్రాంతాలకు వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

🚂 జమ్ము నుంచి శ్రీనగర్‌ వరకు రైల్వేలైన్‌ పనులు పూర్తి కాగానే వందేభారత్ రైళ్లు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 🛤️ అతి త్వరలోనే వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కిస్తామన్నారు. 🚇 నూతన రైళ్లను సాంకేతిక నిపుణులు స్పెషల్ డిజైన్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు.. 🛠️ ఎత్తయిన, వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉన్న చోట కూడా సజావుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. 🌡️ ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ము కశ్మీర్‌లో రైల్వే లైన్ల అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఆసక్తి చూపిస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 🌞

🚄 భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ మాట్లాడుతూ, ప్రతిదీ సరిగ్గా జరిగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నమూనా (వందే భారత్ స్లీపర్ రైలు)తో ప్రపంచ స్థాయి సాటిలేని ప్రయాణ అనుభూతిని అందిస్తాము. 🌌 BEML మొదటి స్లీపర్ వందే భారత్ రైలును అభివృద్ధి చేయడానికి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై మరియు రైల్వే బోర్డుతో కలిసి పనిచేస్తోంది. 🏭🛤️🌆🚇

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page