📍🗓 కటక్, నవంబర్ 23: మూడు ప్యాసింజర్ ట్రైన్లు ఒకే ట్రాక్‌పై వచ్చిన ఘటన రూర్కెలాలో చోటుచేసుకుంది. సుందర్‌గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి.
అయితే అదృష్టవశాత్తూ ఎలంటి ప్రమాదం జరగలేదు. అధికారిక సమాచారం మేరకు సంబల్పూర్-రూర్కెలా మెము రైలు, రూర్కెలా-జార్సుగూడ ప్యాసింజర్ రైలు ఒక ట్రాక్‌లో ఎదురు రెదురుగా వచ్చాయి. 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చిన ఈ రెండు రైళ్లలోని లోకోపైలట్లు వెంటనే అప్రమత్తమై రైళ్లను ఆపు చేశారు.
👮♂️🚗 అధికారి దురుసు ప్రవర్తన.. ఉద్యోగులపైకి దూసుకెళ్లిన అధికారి కారు నిరసన తెలుపుతోన్న సిబ్బందికపైకి ఓ అధికారి నిర్లక్ష్యంగా నడిపిన కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరికి గాయం అయ్యింది. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతుండగా కారుతో ప్రమాదకరంగా ప్రయాణించిన అధికారి దురుసు ప్రవర్తనను ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జీతం బకాయిల్ని తక్షణం చెల్లించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు అనకాపల్లి జిల్లా కశింకోటలో ఆందోళన చేపట్టారు. అయితే వారు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది శిక్షణ తరగతుల్ని బహిష్కరించారు.🚗👮♂️