top of page
Suresh D

‘వాలెంటైన్స్ డే’ రోజున రీ-రిలీజ్ కానున్న నాలుగు లవ్ సినిమాలు ఇవే 🎥💖

ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీన రీ-రిలీజ్‍ల హోరు ఉండనుంది. నాలుగు లవ్ స్టోరీ మూవీస్ మళ్లీ వెండితెరపైకి రానున్నాయి. ఆ వివరాలివే..💖 🌟

వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) కోసం ప్రేమికులు ఎంతో ఎదురుచూస్తుంటారు. తమ మనసుకు నచ్చిన వారితో సమయం గడిపేందుకు, సర్‌ప్రైజ్ చేసేందుకు వేచిచూస్తుంటారు. ఈ తరుణంలో వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చే వారం ఫిబ్రవరి 14న ఏకంగా నాలుగు ఫీల్ గుడ్ లవ్ సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి. మరోసారి వెండితెరపై మెరవనున్నాయి. ఆ వివరాలివే..

ఓయ్💖 🌟

సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఓయ్' సినిమా 2009లో రిలీజ్ అయింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఆకట్టుకున్నా.. కమర్షియల్‍గా అంత హిట్ కాలేదు. అయితే, ఆ తర్వాత టీవీల్లో బాగా ఆకట్టుకుంది. దీంతో క్లాసిక్‍గా చాలా మంది మదిలో నిలిచిపోయింది. ఈ చిత్రం సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చే వారం ఫిబ్రవరి 14న ఓయ్ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ మూవీ కోసం యూత్ బాగా వేచిచూస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కూడా ఈ మూవీకి హైలైట్‍గా నిలిచింది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్💖 🌟

తమిళ స్టార్ హీరో సూర్య డ్యుయల్ రోల్ చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ కూడా వచ్చే వారం ప్రేమికుల రోజున థియేటర్లలోకి మళ్లీ రానుంది. ఈ చిత్రం రీ-రిలీజ్ అవడం ఇది రెండోసారి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ వారనమ్ అరియమ్ చిత్రం తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ 2008లో విడుదలైంది. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. గతేడాది కూడా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రి-రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చేస్తోంది. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది.

తొలిప్రేమ💖 🌟

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమా క్లాసిక్ లవ్ మూవీగా నిలిచిపోయింది. కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో రిలీజ్ అయిన ఈ చిత్రం అందరి మనసులను గెలుచుకొని బ్లాక్‍బాస్టర్ అయింది. పవన్‍కు తొలినాళ్లలో సూపర్ హిట్ అందించింది. ఇప్పుడు, తొలి ప్రేమ సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తోంది. వాలెంటైన్స్ డే రోజున రీ-రిలీజ్ కానుంది. అయితే, తక్కువ సంఖ్య థియేటర్లలోనే ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓసారి ఈ చిత్రం రీ-రిలీజ్ అయింది.

సీతారామం💖 🌟

2022లో రిలీజైన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ మూవీని తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు, సీతారామం సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది. హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో ఈ చిత్రం రీ-రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

bottom of page