తొలి ఓవర్ నుంచి దూకుడు బ్యాటింగ్‌కు పెద్దపీట వేసిన పృథ్వీ.. ఫోర్ల వర్షం కురిపించాడు. దీంతో అతను 58 బంతుల్లో 1 సిక్స్, 12 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లోకి అడుగుపెట్టిన గుస్ మిల్లర్ 68 బంతుల్లో 1 సిక్స్, 9 ఫోర్లతో 73 పరుగులు చేశాడు.
మిల్లర్, పృథ్వీ షాల ఈ తుఫాన్ అర్ధసెంచరీల సాయంతో నార్తాంప్టన్‌షైర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. మిడిల్‌సెక్స్ అద్భుత విజయం..
318 పరుగుల లక్ష్యాన్ని చేధించిన మిడిల్‌సెక్స్‌కు ఓపెనర్ జో క్రాక్‌నెల్ 49 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన నాథన్ ఫెర్నాండెజ్ 83 పరుగులు చేశాడు.
కానీ, కెప్టెన్ మార్క్ స్టోన్‌మన్ మాత్రం మ్యాచ్ రూపాన్ని మార్చేశాడు. ఒక దశలో నార్తాంప్టన్‌షైర్‌కు అనుకూలంగా ఉన్న మ్యాచ్‌ను స్టోన్‌మన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మిడిల్‌సెక్స్‌కు అనుకూలంగా మార్చుకున్నాడు.
78 బంతులు ఎదుర్కొన్న మార్క్ స్టోన్‌మన్ 1 సిక్స్, 10 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. దీంతో మిడిల్‌సెక్స్ జట్టు 48.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
మిడిల్‌సెక్స్ ప్లేయింగ్ 11: నాథన్ ఫెర్నాండెజ్, జో క్రాక్‌నెల్, సామ్ రాబ్సన్, మార్క్ స్టోన్‌మన్ (కెప్టెన్), జాక్ డేవిస్ (వికెట్ కీపర్), మార్టిన్ ఆండర్సన్, ల్యూక్ హోల్‌మన్, జోష్ డి కెయిర్స్, హెన్రీ బ్రూక్స్, ఇషాన్ కౌశల్, నోహ్ కార్న్‌వెల్.
నార్తాంప్టన్‌షైర్ ప్లేయింగ్ 11: పృథ్వీ షా, ఎమిలియో గే, రికార్డో వాస్కోన్‌సెలోస్, జార్జ్ బార్ట్‌లెట్, సైఫ్ జైబ్, లూయిస్ మెక్‌మానస్ (కెప్టెన్), గుస్ మిల్లర్, జస్టిన్ బ్రాడ్, జేమ్స్ సేల్స్, మైఖేల్ ఫినాన్, రాఫెల్ వెథెరాల్.