top of page
Shiva YT

ఉపాసన ప్రెగ్నెన్సీ మీద జనాలు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఉపాసన ప్రెగ్నెన్సీ మీద జనాలు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఉపాసన బేబీ బంప్ కనిపించకపోవడం కూడా చర్చకు దారి తీసింది. దీనికి ఉపాసన పరోక్షంగా స్పష్టత ఇచ్చారు.






































ఉపాసన-రామ్ చరణ్ దంపతులు పదేళ్ల తర్వాత పేరెంట్స్ అయ్యారు. ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని మామయ్య చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఆ హనుమాన్ అశీస్సులతో ఉపాసన తల్లి కాబోతున్నారని ట్వీట్ చేశారు. ఇది చిరంజీవి అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం నింపింది. అప్పటి వరకు ఉపాసన మీద ఉన్న అపవాదులు ఈ ప్రకటన దూరం చేసింది.తల్లి అయ్యాక కూడా ఉపాసన-రామ్ చరణ్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిది సరోగసీ గర్భం అని కొందరు కామెంట్ చేయగా... మరి కొందరేమో ఉపాసనకు అమెరికాలో డెలివరీ కానుంది అంటూ ఆరోపణలు చేశారు. ఉపాసన వీటిపై స్పందించారు. నేను నా మొదటి బిడ్డకు ఇండియాలో అపోలో హాస్పిటల్స్ లో జన్మనిస్తాను అని చెప్పుకొచ్చారు.కాగా ఉపాసన ఇటీవల వరల్డ్ టూర్ కి వెళ్లారు. భర్త రామ్ చరణ్ తో పాటు దేశ విదేశాలు తిరిగారు. కడుపులో బిడ్డతో టూర్స్ తిరగడం ఆనందంగా ఉంది. మాతో పాటు బిడ్డ కూడా ప్రపంచాన్ని చుడుతున్నాడు. గర్భం దాల్చిన మహిళలు బాగా బరువు పెరుగుతారు. అయితే నేను కఠిన డైట్ ఫాలో అవుతున్నాను. బరువు పెరగకుండా చూసుకుంటున్నాను. అలా అని తినకుండా ఉండటం లేదు. నా కోసం బిడ్డ కోసం పోషకాహారం మాత్రమే తీసుకుంటున్నానని ఉపాసన అన్నారు. ఇంకా అనేక సంగతులు ఉపాసన చెప్పుకొచ్చారు. కాగా ఏడు నెలలు అవుతున్నా ఉపాసన గర్భం కనిపించదేమని కొందరి సందేహం. ఉపాసన తల్లి అయ్యారని ప్రకటించి నాలుగు నెలలు దాటిపోగా ఆమెకు ఏడో నెలని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలో ఉపాసనకు గర్భం కనిపించాలి కదా అంటారు కొందరు. దీనికి ఉపాసన పరోక్షంగా సమాధానం చెప్పారు. శరీరానికి తగినట్లు బట్టలు, మూడ్ కి తగ్గట్లు ఆభరణాలు ధరిస్తానని ఉపాసన వెల్లడించారు. అంటే బేబీ బంప్ కనిపించకపోవడానికి నేను ధరించే బట్టలే అని ఉపాసన పరోక్షంగా చెప్పారు. ఓ ఆభరణాల షో రూమ్ లాంఛింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన ఈ కామెంట్స్ చేశారు. ఇక రామ్ చరణ్-ఉపాసనల జీవితాల్లో 2022-23 ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఏకంగా ఆస్కార్ గెలిచిన చిత్ర హీరోగా రికార్డులకు ఎక్కారు. ఆయన ఫేమ్ ఖండాంతరాలు దాటింది. ఉపాసన కూడా ఇటీవల బిజినెస్ ఉమన్ అరుదైన మైలురాళ్లు చేరుకున్నారు. కొత్త బాధ్యతలు చేపట్టారు. వీటన్నింటికీ మించి రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చిన నేపథ్యంలో కుటుంబంలో సంతోషాలు వెల్లువెత్తాయి.


bottom of page