top of page

అప్డేట్ ఇదిగో ‘బ్రో’ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ ఏర్పడింది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.

మోస్ట్ అవైటెడ్ చిత్రం బ్రో. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తొలిసారి మామా, మేనల్లుడు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో బ్రో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ ఏర్పడింది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.ఇటీవల మేకర్స్ ఆస్ట్రేలియాకు ఓ సాంగ్ షూటింగ్ నిమిత్తం వెళ్లగా ఆ చిత్రీకరణ విజయవంతంగా కంప్లీట్ అయ్యింది. ఈ షూట్ తో సినిమా మొత్తం కంప్లీట్ అయ్యిందని తెలియజేస్తూ ఓ ఫోటో తన ఇన్ స్టాలో షేర్ చేశారు తేజ్. ఆస్ట్రేలియాలో షూటింగ్ తనకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ.. బ్రో సాంగ్ షూట్ పిక్ షేర్ చేశారు.

ఇదిలా ఉంటే.. జూలై 28న అడియన్స్ ముందుకు రానుంది. ఇక మరో రెండు , మూడు రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page