top of page

అప్పటిదాకా సైలెంట్‌గా ఉంటే మంచిది.. హసీనాకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ యూనస్‌ హెచ్చరిక..


హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తల దాచుకున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ మహమ్మద్‌ యూనస్‌ హెచ్చరికలు జారీ చేశారు. దేశం నుంచి పారిపోయి ఇక్కడ తలదాచుకుంటూ ప్రకటనలు చేయడం పట్ల మండిపడ్డారు. భారత్‌ నుంచి ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అది ఇరు దేశాలకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను ఢాకా కోరేవరకు ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. భారత్‌ ఆ ఆలోచనను విడనాడాలి

బంగ్లాలోని అవామీ లీగ్‌ పార్టీ తప్ప మిగతావన్నీ ఇస్లామిస్ట్‌ పార్టీలని, హసీనా లేకపోతే బంగ్లా మరో అఫ్గానిస్థాన్‌లా మారిపోతుందన్న ఆలోచనను భారత్‌ విడనాడాలని యూనస్‌ అన్నారు. హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడంతో ఏ ఒక్కరూ సౌకర్యంగా లేరని, అందుకే తాము ఆమెను భారత్‌ నుంచి రప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page