top of page
Suresh D

హోలీ తర్వాత మీ స్కిన్, హెయిర్‌ని ఇలా కాపాడుకోండి..


హోలీ తర్వాత మన జుట్టు, స్కిన్ రంగులతో నిండి ఉంటుంది. దీనిని మొత్తం తీసేసి మునుపటిలా చేయాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటితో పాటు.. హోలీ తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి.. ముందుగా పొడి గుడ్డతో కలర్‌ని అంతా దులపండి. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకోండి 

స్కిన్‌కి..: ముందుగా స్కిన్‌ని కలర్స్ నుంచి కాపాడాలంటే మంచి హెర్బల్ క్లెన్సర్ తీసుకోండి. ఇందుకోసం శనగపిండి, పాలు, పసుపు కలిపి దాంతో చర్మం మొత్తం రాయండి. అయితే, గట్టిగా రుద్దొద్దు. కేవలం రాస్తే సరిపోతుంది. తర్వాత నీటితో క్లీన్ చేయండి.

ఫేస్‌ప్యాక్..:  ఇందుకోసం అలోవెరా జెల్, పెరుగు, తేనె కలిపి ఫేస్‌మాస్క్ తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. దీంతో ముఖం హైడ్రేట్‌గా మారుతుంది. దీనిని ముఖానికి రాసి ఆరిన తర్వాత క్లీన్ చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయండి. 

స్నానం తర్వాత.. : కలర్స్, ట్యాన్ నుంచి స్కిన్‌ని కాపాడుకోవాలంటే ఎక్స్‌ట్రా పాంపరింగ్ అవసరం. క్లీన్ చేసే సమయంలో చర్మ సహజ నూనెలు తగ్గిపోతాయి. చర్మం పొడిగా, దురదగా మారుతుంది. దీనిని నేచురల్‌గా మాయిశ్చరైజ్ చేయాలి. ఆముదంతో మాయిశ్చరైజ్ చేస్తే అది చాలా మంచిది. తర్వాత ఫేస్ క్లీన్ చేయాలి.

జుట్టుకి షాంపూ..: అదే విధంగా, హోలీ ఆడే ముందే జుట్టుకి ఆయిల్ అప్లై చేస్తాం. కాబట్టి, ఎక్కువగా కలర్స్ జుట్టుపై ఎఫెక్ట్ చూపకుండా ఉంటాయి. వీటిని కూడా మనం షాంపూతో క్లీన్ చేయాలి. ఇందుకోసం హెర్బల్ షాంపూ, కండీషర్ అప్లై చేయండి.

హెయిర్ ప్యాక్.. : తర్వాత.. మంచి హెయిర్ మాస్క్ వేయండి. ఇందుకోసం గుడ్డు, పెరుగు కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మరోసారి స్నానం చేయండి.

bottom of page