భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. కాసేపటి క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. కీవ్‌లోని హోటల్‌లో ఆయన బస చేస్తారు. ఉక్రెయిన్ రాజధానిలో ఆయన భారతీయ సంతతి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. పోలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న మోదీ.. ఇవాళ కీవ్‌కు చేరుకున్నారు. 1991లో సోవియేట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందింది. అయితే ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లిన భారత తొలి ప్రధానిగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ భేటీకానున్నారు. పోలాండ్ నుంచి రెయిల్ ఫోన్స్ వన్ రైలులో ప్రధాని మోదీ కీవ్‌కు చేరుకున్నారు. సుమారు 10 గంటల పాటు ఆయన రైలులో ప్రయాణించారు. ఆరు నెలల క్రితం రష్యాలో పర్యటించిన మోదీ.. ఇప్పుడు ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్, పశ్చిమ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం తీవ్ర ఆందోళన కలిగిస్తున్దని, దౌత్యంతో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయనున్నట్లు మోదీ తెలిపారు.