🔵 బీసీలకు టికెట్లపై కాంగ్రెస్ లో డిమాండ్ పెరిగింది. జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ కు అల్టిమేటం ఇస్తున్నారు. టిక్కెట్ల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎదురు దాడి తప్పదని హెచ్చరిస్తున్నారు బీసీ నేతలు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో.. 1. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్, 2. వేములవాడ్ – ఆది శ్రీనివాస్, 3. కరీంనగర్ -కొనగల మహేష్. ఈ మూడు సెగ్మెంట్ లలో హుస్నాబాద్, కరీంనగర్ లలో ఓసి లీడర్స్ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
పెద్దపల్లి లోక్ సభ పరిధిలో.. 1. రామగుండం – రాజ్ ఠాకూర్, 2. పెద్దపల్లి – గంటా రాములు యాదవ్, ఈర్ల కొమురయ్యలు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. ఆదిలాబాద్ -గండ్ర సుజాత, 2 సిర్పూర్ – రావి శ్రీనివాసస్ 3. ముధోల్ – ఆనంద్ రావు పటేల్ లు ఉన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. ఆర్మూర్ -గోర్తా రాజేందర్, 2. నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్, ఈరత్రి అనిల్ పోటీ పడుతున్నారు.
మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో.. 1.దుబ్బాక -కత్తి కార్తీక గౌడ్,2. పటాన్ చెరువు – కాట శ్రీనివాస్ గౌడ్,3. సిద్దిపేట – శ్రీనివాస్ గౌడ్ లు బీసీ కోటాలో టిక్కెట్ అడుగుతున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. బాన్సువాడ – బాలరాజు, 2. నారాయణఖేడ్ – సురేష్ షట్కర్ పోటీ లో ఉన్నారు..
మల్కాజ్గిరి సెగ్మెంట్ లో.. 1. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్,2. మల్కాజ్ గిరి – నందికంటి శ్రీధర్,3. ఎల్బీనగర్ -మధు యాష్కీ
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, 2. అంబర్ పేట్ నూతి శ్రీకాంత్ గౌడ్, మొతా రోహిత్
చేవెళ్ల లోక్ సభ పరిధిలో.. 1. రాజేంద్రనగర్ – గౌరీ సతీష్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 2. శేరిలింగంపల్లి – జర్పెటి జైపాల్ లు బీసీ కోటాలో తమకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో.. 1. నారాయణపేట -ఎర్ర శేఖర్, 2. షాద్ నగర్ – ఈర్లపల్లి శంకర్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, 3.దేవరకద్ర – ప్రదీప్ గౌడ్, 4.మక్తల్ – శ్రీహరి, నాగరాజు గౌడ్ లు ఉన్నారు.
నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లో.. 1. గద్వాల్ – రాజీవ్ రెడ్డి, సరితా తిరుపతయ్య
నల్లగొండు పార్లమెంట్ పరిధిలో.. 1. నల్లగొండు – చెరుకు సుధాకర్
భువనగిరి పార్లమెంట్ పరిధిలో.. 1. మునుగోడు – పున్నా కైలాష్ నేత, 2. ఆలేరు -బీర్ల ఐలయ్య, 3. జనగామ -పొన్నాల లక్ష్మయ్యలు అయా సెగ్మెంట్ పరిధిలో తమకు టిక్కెట్ దక్కే అవకాశం ఉంది.
వరంగల్ పార్లమెంట్ పరిధిలో.. 1. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ, 2. పరకాల – అవేలి దామోదర్,
మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. నర్సంపేట – మేకల వీరన్న యాదవ్ టిక్కెట్ రేసులో ఉన్నారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో.. 3 జనరల్ స్థానాలు ఉన్నప్పటికీ బీసీ నేతలు లేకపోవడంతో ఓసి లకు టిక్కెట్ కేటాయింపు చేసే అవకాశం లేదు.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. 1. మలక్ పేట్ – చక్లోకర్ శ్రీనివాస్, 2. గోషామహల్ – మెట్టు సాయికుమార్.