📍ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. 🤝
దాదాపు 40 మంది వరకు పనివాళ్లు ఇందులో చిక్కుకున్నారని తెలుస్తోంది. 🌄 సొరంగంలో చిక్కుకున్న పనివాళ్లు అందరూ సురక్షితంగా ఉన్నారని, వాళ్లతో మాట్లాడేందుకు వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 🌐 సొరంగం కూలిన ప్రదేశం ఇరుగ్గా లేదని, అక్కడ వర్కర్స్ అటు ఇటు తిరిగేందుకు 400 మీటర్ల వరకు స్థలం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 🌳 యమునోత్రి జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న ఈ సొరంగం నిన్న ఉదయం కూలింది. 🛤️ సొరంగంలో చిక్కుకున్న వారిలో ఒక్కరూ మాత్రమే ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. 🌍 మిగిలిన వారందరూ హిమాచల్, బిహార్, అస్సాం, ఒడిశా, బెంగాల్‌కు చెందిన పనివాళ్లని గుర్తించారు. 🚀
🕳️ టన్నెల్ ప్రారంభం నుంచి 200మీటర్ల వరకు సిమెంట్ చేసి చక్కగా ఉందని, కాని, ఆ తర్వాత పనులు సాగుతుండటంతో తవ్వకాలు జరిపే సమయంలో మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయని అధికారులు తెలిపారు. 🚦 దీని వల్ల సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఏది ఏమైనా అందరికీ సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర అధికారులు తెలిపారు. 🚀 టన్నెల్ ప్రవేశ ద్వారం నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం వర్కర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 🌐