top of page
Suresh D

తిరుమ‌లలో ద‌ర్శ‌నాల‌కు బ్రేక్‌...ఎందుకో తెలుసా? 🕉️

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ అనంత‌రం తిరుమ‌ల‌లో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమ‌తి ఉండ‌ద‌ని తెలుస్తోంది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ అనంత‌రం తిరుమ‌ల‌లో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమ‌తి ఉండ‌ద‌ని తెలుస్తోంది. నిత్యం వేలాది మంది భ‌క్తులు సంద‌ర్శించే స్వామివారికి సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలనేవి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా వీఐపీ ద‌ర్శ‌నాలంటే రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబంతో స‌హా వీఐపీ, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొనేందుగా వీలుగా ఉంటుంది. వీటిలో ప్రజా ప్రతినిధులు వారి అనుచర వర్గానికి, నియోజకవర్గ ప్రజలకు వారి సిఫార్సు లేఖ ద్వారా ఈ వీఐపీ ద‌ర్శ‌నాల‌ను పొందతుంటారు. ఈ సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన వారు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. 🚶‍♂️🕍

bottom of page