📅 మరికొన్ని రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు రానున్నాయి. 🏙️ పట్టణాలు, నగరాల్లో ఉండే చాలామంది ప్రజలు తమ సొంతూళ్లుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. 👣
ఈ నేపథ్యంలో ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 🚌 ప్రజల సౌకర్యార్థం కోసం ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది టీఎస్‌ఆర్టీసీ. 📅 అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నాయి.
🌆 హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 🚍 అలాగే హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంచనున్నారు. 🚌 అంతేకాదు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాంతాల నుంచి నడపాలని నిర్ణయం తీసుకున్నారు సంస్థ అధికారులు. 🧑💼🚆