తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2(TSPSC Group 2) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక.😃
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2(TSPSC Group 2) అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకొనేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.జులై 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో 783 పోస్టులకు గానూ 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న విషయం గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.మొత్తం 4 పేపర్లకు ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో పేపర్ 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు కలిపి మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులుండవు. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు విడుదల అవుతాయి.తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వ పరీక్షలు కోసం అభ్యర్థులు బాగా చదువుతున్నారు. ఎన్నికల లోపు జరగనున్న పరీక్షలకు తీవ్రంగా పోటి నెలకొంది. ముఖ్యంగా గ్రూప్-2 పరీక్షను ఎంతో సవాల్ గా తీసుకుంటున్నారు.