top of page
MediaFx

తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ (PGECET) పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూ హైదరాబాద్ నిర్ణయించింది. గ్రూప్-1, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్ పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన పీజీఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది.

 తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్ల‌డించింది. జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌ను 1:3 నిష్ప‌త్తిలో, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌ను 1:5 నిష్ప‌త్తిలో పిల‌వ‌నున్నారు. క‌మ్యూనిటీ, నాన్ క్రిమి లేయ‌ర్(బీసీల‌కు), పీడ‌బ్ల్యూడీ స‌ర్టిఫికెట్స్, స్ట‌డీ లేదా రెసిడెన్స్ స‌ర్టిఫికెట్స్(క్లాస్ 1 నుంచి 7 వ‌ర‌కు), రిజ‌ర్వేష‌న్ క‌లిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్ రిలాక్సేష‌న్, క్వాలిఫికేష‌న్ స‌ర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాల‌ని టీఎస్‌పీఎస్సీ సూచించింది. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ స‌మ‌యంలో వీటిలో ఏ డాక్యుమెంట్ స‌మ‌ర్పించ‌క‌పోయినా ఆ అభ్య‌ర్థుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని తేల్చి చెప్పింది. 

bottom of page