top of page

🚗 పాత వాహనాలకు TG రిజిస్ట్రేషన్? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం 🛣️

🗓️ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌లో నంబర్ ప్లేట్లపై TS బదులు TG ఉండాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు ఇచ్చింది. 🚦

🚗 తెలంగాణలో ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్లలో TS బదులు TG ఉంటుంది. ఆల్రెడీ వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్లను TG పేరుతో నమోదుచేయించుకుంటున్నారు. TG పేరుతో కొత్త రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇది జరుగుతోంది. ప్రభుత్వం TS బదులుగా TG పేరుతో వాహనాలకు నంబర్ ప్లేట్లు ఇవ్వడానికి మరో వారం 10 రోజులు పట్టొచ్చని తెలుస్తోంది. ఆర్టీఓ ఆఫీసుల్లో అధికారులు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. కొత్తగా వాహనాలు కొనుక్కునేవారు.. వాటి నంబర్ ప్లేట్‌లు TG పేరుతో నమోదు చేయించుకుంటున్నారు. 📅

🚗 ఈ TG అనేది కొత్త వాహనాలకేనా, లేక పాత వాహనాలకు కూడా మార్చుకోవాలా అనే సందేహం తెరపైకి వచ్చింది. దాంతో చాలా మంది దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త వాహనాలకు మాత్రమే TG పేరుతో నంబర్ ప్లేట్లు వస్తాయనీ, పాత వాహనా TS పేరుతో నంబర్ కలిగినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు TG పేరుతో నంబర్ ప్లేట్ కావాలని అనుకుంటే, అప్లై చేసుకోవచ్చు. అప్పుడు వారికి కొత్త రిజిస్ట్రేషన్ వస్తుంది. అవసరం లేదనుకునేవారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు పాత ప్లేట్‌తోనే వాహనాన్ని నడపవచ్చు. అలాగే AP కోడ్‌తో తెలంగాణలో తిరుగుతున్న వాహనాలకు కూడా మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ నంబర్ ప్లేట్‌లో TS బదులు TGకి సంబంధించి ప్రభుత్వానికి ఇంకా ఫైల్ అందలేదు. ఈ ఫైల్ రవాణా శాఖ అధికారుల దగ్గర ఉంది. వారు ఫైల్ ఇచ్చాక, దాన్ని రవాణా శాఖ పరిశీలించి, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తర్వాత గెజిట్ వస్తుంది. తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఇదో పెద్ద ప్రక్రియ. ఇది పూర్తి కావడానికి వారం నుంచి 10 రోజులు పడుతుంది అంటున్నారు. ఐతే.. పాత వాహనాలకు మార్పు అవసరం లేదని ప్రభుత్వం చెప్పడం వల్ల, వాహనదారులు ఉపశమనంగా ఫీలవుతున్నారు. 🚨

bottom of page