top of page

TSLPRB SI Answer Key 2023 : తెలంగాణ పోలీస్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. ఆన్సర్‌ కీ విడుదల..

TSLPRB SI Key : ఆన్సర్‌ కీ పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. మే 14వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు పంపాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

TSLPRB SI Answer Key 2023 : తెలంగాణ (Telangana)లో ఎస్‌ఐ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఫైనల్‌ రాత పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ని గురువారం (మే 11)న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 08, 09 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను తెలంగాణ వ్యాప్తంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించారు. మొదటి రోజు మ్యాథ్స్, ఇంగ్లీష్ పేపర్ (English) ను నిర్వహించగా.. ఏప్రిల్ 09వ తేదీన జనరల్ స్టడీస్ అండ్ తెలుగు పేపర్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 59,534 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లోని 81 కేంద్రాల్లో ఎస్‌ఐ రాత పరీక్ష జరిగింది. ఎస్‌ఐ ( సివిల్), ఎస్‌ఐ (ఐటీ), ఎస్‌ఐ (పీటీఓ), ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్) విభాగంలో 4 పేపర్లకు పోలీసు నియామక మండలి (TSLPRB) పరీక్షలు నిర్వహించింది. అధికారిక వెబ్‌సైట్‌ లో ప్రిలిమినరీ 'కీ' అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. మే 14వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ నిర్ణీత నమూనాను కూడా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. అభ్యంతరాలకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను పీడీఎఫ్/జేపీఈజీ ఫార్మాట్లో అప్ లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఇక.. ఈ పరీక్షల తుది ఫలితాలను జూన్ లో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. TSPSC AO Hall Ticket 2023 : తెలంగాణ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TSPSC Agriculture Officer Hall Ticket 2023 : తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ (Agriculture Officer) పోస్టుల భర్తీకి మే 16న నియామక పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు TSPSC విడుదల చేసింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అలాగే.. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు లింక్‌ అందుబాటులో ఉంది.

తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి TSPSC డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు.. జనవరి 10 నుంచి 30 వరకు అప్లయ్‌ చేసుకున్నారు. వీరికి మే16న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page