📱ఫోన్స్ స్విచ్ ఆఫ్.. 📋 సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయింపు ఉంటుందని గులాబీ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు డిసైడ్ చేశారు. 👤 అయితే, ముఖ్యమంత్రి చేయించిన ఇంటెలిజెన్స్ సర్వేలో తమ పనితీరు ఏ రకంగా ఉంది.. టికెట్ వస్తుందా లేదా.? 🎫
అన్న ప్రశ్నలతో నేతలు అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.. 🤝 దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేల అభ్యర్థులు కంటిన్యూగా ఫోన్లు చేస్తుండడంతో ఏం చెప్పాలో తెలియక ఇంటలిజెన్స్ అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడినట్లు పలువురు పేర్కొంటున్నారు. 🤨 బీఆర్ఎస్ మొదటి అభ్యర్థుల లిస్టు బయటికి వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఫోన్లు మోత మొగుతున్నాయని.. 📅 పలువురు అధికారులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
📝 సర్వే రిపోర్ట్ ప్లీజ్.. 📊 సర్వేలకు సంబంధించిన సమాచారం ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఉన్న నేపథ్యంలో సర్వేలు ఏ రకంగా ఉన్నాయి.. 📋 చివరి ప్రయత్నం ఏమైనా చేసుకోవచ్చా.. అన్న సజెషన్స్ అయినా ఇవ్వండి అంటూ అధికారులను అసంతృప్త ఎమ్మెల్యేలు వేడుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. 💬 దీంతో ఎవరికి ఏం చెప్పాలో తెలిక తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు చాలామంది నిన్న సాయంత్రం నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. 📞