top of page
MediaFx

నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ !! ఇంతకీ వీరి ఇష్యూ ఏంటంటే ??

నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా? నయన్ పెడుతున్న కండీషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా? చూద్దాం వీరి మధ్య ఏం జరుగుతుందో.

40 దాటాక త్రిషకు మహర్దశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాల్లేవు. ఓ టైమ్‌లో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఈమె 10 సినిమాలు చేస్తున్నది. తెలుగులోనూ చిరంజీవితో "విశ్వంభర"లో నటిస్తున్నారు త్రిష.

త్రిష ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. "విశ్వంభర"కు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే టైమ్‌లో నయనతారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిషకే వెళ్తున్నాయని తెలుస్తుంది. కారణం? నయన్ ప్రమోషన్స్‌కు రాదు, డేట్స్ ఇష్యూస్ ఎక్కువ. త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్లే చేస్తుంటారు.

"జవాన్" తర్వాత నయనతార సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. పైగా ఆమె పారితోషికం కూడా ఎక్కువ. త్రిష మాత్రం రెండు రకాల పాత్రలను చేయడం, తక్కువ పారితోషికం తీసుకోవడం వలన బిజీగా ఉంటున్నారు.

నయనతార మైనస్‌లు త్రిషకు ప్లస్ అవుతున్నాయి. నయన్ అధిక పారితోషికం మరియు ఫోకస్ మార్పు వలన అవకాశాలు కోల్పోతుంటే, త్రిష ఫ్లెక్సిబిలిటీ మరియు వైవిధ్యపూరితమైన పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు.


bottom of page