top of page
Suresh D

🔥💥 ఫలక్‌నుమా అగ్ని ప్రమాదం: ముందే పసిగట్టి వేలమంది ప్రాణాలు నిలబెట్టింది ఇతనే 💔

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య గత శుక్రవారం (జులై 7) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. 🚆😱 అందరూ చూస్తుండగానే ఆరు బోగీలు కాలిబూడిదయ్యాయి. 🚃🔥 సమయానికి అధికారులు, ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య గత శుక్రవారం (జులై 7) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. 🚆😱 అందరూ చూస్తుండగానే ఆరు బోగీలు కాలిబూడిదయ్యాయి. 🚃🔥 సమయానికి అధికారులు, ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. 💔 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తేల్చిచెప్పినా ఎన్నో అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. 🤔🔍 ఐతే ఈ ప్రమాద సమయంలో సిగిల్ల రాజు అనే యువకుడు చూపిన సమయస్పూర్తి ఎందరో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. 🙏🚀 ప్రమాదాన్ని ముందే పసిగట్టి ట్రైన్‌ చైన్‌ లాగి వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. 🏃‍♂️💨 పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారం పుర పరిధిలోని లక్ష్మీనగర్‌లో పదేళ్లుగా అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 👨‍👩‍👧‍👦 అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..పలాసల్లో అమ్మ పార్వతి, చెల్లి పావని, పెద్దమ్మ బృందావతితో కలిసి ఉదయం 11 గంటల సమయంలో రాజు ఎస్‌4 బోగిలో ఎక్కి కూర్చున్నారు. 🌅🚃 పై బెర్తులో పడుకొన్న రాజుకు ఒక్కసారిగా రబ్బరు కాలిన వాసన వచ్చింది. 👃👕 దానితోపాటు ట్రైన్‌ పై భాగం నుంచి వేడిగా అనిపించడంతో ఎంత వల్లనేమోనని తొలుత అనుకున్నాడు. 👀🚂 అంతలోనే వాసన మరింత ఎక్కువవడంతో కిందికి దిగి కిటికీలోంచి చూస్తూ రైలు నుంచి దట్టమైన పొగ రావడం గమనించాడు. 🏞️👁️‍🗨️వెంటనే చైన్‌ లాగిన రాజు కేకలు వేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. 👑💨 ఆ తర్వాత అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం అందిచాడు. 🔥📞 ప్రమాద కేంద్రం రాజు కుటుంబం కూర్చున్న బెర్తు వద్దనే ఉండటంతో కుటుంబాన్ని తొలుత కిందకి దించాడు. 👨‍👩‍👧‍👦❌ అలాగే తోటి ప్రయాణికులను కూడా సహకరిస్తున్న క్రమంలో పొగను ఎక్కువగా పీల్చడంతో రాజు స్పృహతప్పి పడిపోయాడు. 😷😫 అశ్వస్థతకు గురైన వారందరినీ భువనగిరి ఆసుపత్రికి తరలించారు. 🏥💉 ఇలా ప్రమాదాన్ని ముందే పసిగట్టడమేకాకుండా చైన్‌ లాగి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో రాజు వేలాది ప్రయాణికులు ప్రాణాలు కాపాడాడు. 🙏🚆


bottom of page