పులులు, సింహాలను దగ్గర నుంచి చూడాలంటే చాలా ధైర్యం కావాలి. ఇటీవలి కాలంలో చాలా మంది ఫారెస్ట్ టూర్‌లకు వెళ్తున్నారు. అక్కడ తమకు కనిపించిన జంతువులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
పులులు, సింహాలను దగ్గర నుంచి చూడాలంటే చాలా ధైర్యం కావాలి. ఇటీవలి కాలంలో చాలా మంది ఫారెస్ట్ టూర్‌లకు వెళ్తున్నారు. అక్కడ తమకు కనిపించిన జంతువులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి జంగిల్ సఫారీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మినీ బస్సులో టూరిస్ట్‌లు అటవీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో బస్సును నాలుగు పులులు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఒక పులి అయితే ఏకంగా బస్సు పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ బస్సులోని వారు భయంతో కేకలు వేశారు. ఆ బస్సు డ్రైవర్ మాత్రం ఎలాంటి ఆందోళనకూ గురికాకుండా ధైర్యంగా నెమ్మదిగా బస్సును ముందుకు పోనిచ్చాడు. లాభం లేదనుకున్న పులులు బస్సును వదిలేసాయి. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు.