top of page
Shiva YT

🏝 సమ్మర్‌ హలీడేస్‌ టూర్‌ ప్లాన్ చేస్తున్నారా..? 🌍 మన దేశంలోని అందమైన, అద్భుత ద్వీపాలు..

🎉 ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ ప్రత్యేక ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల తాకిడి పెరిగింది. కానీ మన భారతదేశంలో లక్షద్వీప్‌తో పాటు ప్రకృతి అందాలతో నిండిన అనేక ఇతర ద్వీపాలు కూడా ఉన్నాయి.


మజులి ద్వీపం: 🌊 నదిపై నిర్మించిన మజులి ద్వీపం, ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. సహజ సౌందర్యంతో అద్భుతంగా కనిపిస్తుంది. 🏞 జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. గౌహతి మరియు జోర్హాట్ విమానాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నాయి.

డయ్యూ ద్వీపం: 🏖 డయ్యూ ద్వీపంలో పోర్చుగీస్ సాంస్కృతిక, వాస్తుశిల్పం జాడలు చూడవచ్చు. ఈ ద్వీపంలోని పంజిమ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. 🌴 దాని అందమైన బీచ్, సీఫుడ్ కారణంగా పర్యాటకులకు ఉత్తమమైన ప్రదేశంగా మారింది.

ఎలిఫెంటా ద్వీపం: 🏝 ముంబై హార్బర్‌లో ఉంది ఈ ద్వీపం. ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. 🕍 రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది.

దివార్ ద్వీపం: 🌴 ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. పంజిమ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. 🏰 దీన్ని ఐలాండ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌గా పిలుస్తారు.

సెయింట్ మేరీస్ ద్వీపం: 🏝 సెయింట్ మేరీస్ ద్వీపం 4 చిన్న దీవులతో కూడిన సమితి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. క్రిస్టల్ శిలలు ఏర్పడతాయి. 🌅 మాల్పే నుండి పడవలో ప్రయాణించాల్సి ఉంటుంది. వసతి సౌకర్యం లేదు.

పాంబన్ ద్వీపం: 🏝 రామేశ్వరం ద్వీపం ఇది తమిళనాడులో ఉంది. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. 🌊 తెల్లని ఇసుక బీచ్‌ల కారణంగా పాంబన్ ద్వీపం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. తమిళనాడు పర్యటనలో ఉన్నట్లయితే, ఈ ద్వీపం అందాలను ఖచ్చితంగా చూడండి. 🏖 ఇక్కడకు చేరుకోవడం కూడా చాలా సులభం.

Kommentare


bottom of page