top of page

🌬️ ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం🌧️

ఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక నగరాలను శీతాకాలంలో తీవ్రమైన వాయుకాలుష్యం వేధిస్తోంది. 🌬️ ప్రకృతిపరంగా ఎదురయ్యే పరిస్థితులకు మానవ తప్పిదాలు తోడై నానాటికీ వాయుకాలుష్యం స్థాయిలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

పంజాబ్, హర్యానా సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంట ముగిసిన తర్వాత పంటవ్యర్థాలను తగులబెట్టడం వల్ల పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. 🌾 పంటవ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయించాలంటూ అటు సుప్రీంకోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదు. 🚫 పంటవ్యర్థాలను కాల్చడం హత్యతో సమానం అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినా సరే.. పరిస్థితిలో ఇప్పటికిప్పుడు మార్పు వచ్చే అవకాశం లేదు. ❌

ఇదిలా ఉంటే.. దీపావళి పర్వదినం సందర్భంగా వినియోగించే బాణాసంచా ఢిల్లీ గాలిని మరింత విషతుల్యంగా మార్చుతోంది. 💨 ఈమధ్య కాలంలో చైనా నుంచి అక్రమమార్గాల్లో దిగుమతి చేసుకుంటున్న టపాసుల్లో అత్యంత ప్రాణాంతక రసాయన మిశ్రమాలున్నాయని అనేక అధ్యయన నివేదికలు తేల్చాయి. 🧪 ఈ సందర్భంగా తొలుత చైనా టపాసులపై, ఆ తర్వాత కాలుష్యాన్ని వెదజల్లే టపాసులపై న్యాయస్థానం నిషేధం విధిస్తూ వచ్చింది. 🔒 గ్రీన్ క్రాకర్స్ పేరుతో కాలుష్యాన్ని వెదజల్లని టపాసులకు మినహాయింపునిచ్చింది. 🌿 ఈ ముసుగులో వ్యాపారుల నుంచి వినియోగదారులు కాలుష్యకారక టపాసులను వినియోగించి కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నారు. 🔄

bottom of page