top of page

🌍✈️ మధ్యప్రదేశ్‌లోని మహా క్షేత్రాలు ఇవి.. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లొచ్చు.. 🏞️✈️

🏙️ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్ మహా దర్శన్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్యాకేజీలో నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఉంటుంది. 🌃🌄✈️ విమానంలో తీసుకెళ్ళి తీసుకొచ్చే ఈ ప్యాకేజీ ధరలు రూ. 22,400 నుంచి ప్రారంభమవుతాయి. 🛫💰

డే1(హైదరాబాద్-ఇండోర్ – ఉజ్జయిని): 🏙️🛫 హైదరాబాద్ నుంచి ఇండోర్‌ విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం ఇండోర్ విమానాశ్రయంలో ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకొని, ఉజ్జయినికి తీసుకెళ్తారు. 🚌🌆 అక్కడ హోటల్‌లో చెక్‌ ఇన్ అయ్యాక.. ఆలయం లేదా పరిసరాలను సందర్శించవచ్చు. ఉజ్జయినిలోనే రాత్రి బస ఉంటుంది. 🏨🌙

రోజు2(ఉజ్జయిని): 🌄 హోటల్‌లో అల్పాహారం చేశాక ఉజ్జయిని స్థానిక దేవాలయాలైన హర్సిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు. రాత్రి భోజనం చేశాక ఉజ్జయినిలోనే బస చేస్తారు. 🌃🌆

డే3(ఉజ్జయిని – మండు – ఓంకారేశ్వర్): 🌅 ఉదయాన్నే కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మండుకు బయలుదేరుతారు. మండు ఫోర్ట్, జహాజ్ మహల్ సందర్శిస్తారు. మధ్యాహ్నం మహేశ్వర్‌కు బయలుదేరుతారు. అహల్యా దేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ సందర్శిస్తారు. తర్వాత ఓంకారేశ్వర్‌కు వెళ్లి డిన్నర్‌ చేసి అక్కడే బస చేస్తారు. 🕌🌅

రోజు4(ఓంకారేశ్వర్- ఇండోర్): 🌄✈️ హోటల్‌లో అల్పాహారం చేశాక ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి ఇండోర్‌కు బయలుదేరి పీఠేశ్వర్ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇండోర్‌లోనే రాత్రిభోజనం చేసి బస చేస్తారు. 🌃🍽️

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page