top of page

భారతీయ సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్‌ దర్శకుడు చక్రవర్తి కన్నుమూత


ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి (76) తుదిశ్వాస విడిచారు. రీజెంట్ పార్క్‌లోని తన నివాసంలో ఆయనకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తె రీతాభరి, చిత్రాంగద, భార్య సతరూప సన్యాల్‌ ఉన్నారు. సన్యాల్‌ సినీ నిర్మాత. ఉత్పలేందు చక్రవర్తి 1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 1981 సంవత్సరంలో తన తొలి చిత్రానికే ఇందిరా గాంధీ అవార్డు వరించింది. ఆయన తన కెరీర్‌లో మోయన్‌తాడంటో (1980), చందనీర్ (1989), ఫాన్సి (1988), దేబ్‌శిశు (1987) చిత్రాల్లో సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్త విశ్వవిద్యాలయాల్లో చదివారు. సత్యజిత్ రే, రవీంద్ర సంగీత్‌, దేబబ్రత బిస్వాస్ డాక్యుమెంటరీలను రూపొందించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న సీవోపీడీ అతను చాలా సంవత్సరాలుగా క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (COPD)తో బాధపడుతున్నారు. ఆయన మృతికి సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో తీరని లోటు అని పేర్కొన్నారు. అలాగే, సినీ సెంట్రల్‌ ఫిల్మ్‌ క్లబ్‌ సైతం ఆయన మృతికి సంతాపం ప్రకటించింది.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page