top of page

🚗 నేటి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఫిబ్రవరి 15 వరకు.. 🚦

🌐 హైదరాబాద్‌లో ప్రతీ ఏటా జరిగే నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 🌟 దేశ నలుమూలల నుంచి వ్యాపారులు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తుంటారు. వేలల్లో స్టాల్స్‌తో దేశవ్యాప్తంగా లభించే అన్ని వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండడం నుమాయిష్‌ ప్రత్యేకత.

🌐 హైదరాబాద్‌లో ప్రతీ ఏటా జరిగే నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 🌟 దేశ నలుమూలల నుంచి వ్యాపారులు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తుంటారు. వేలల్లో స్టాల్స్‌తో దేశవ్యాప్తంగా లభించే అన్ని వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండడం నుమాయిష్‌ ప్రత్యేకత.ఇదిలా ఉంటే ప్రతీ ఏటలాగే ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

📅 ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

🚥 **నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరగనున్న నుమాయిష్‌ నేపథ్యంలో సోమవారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సీపీ కే. శ్రీనివాస రెడ్డి తెలిపారు. 🌆 ఇందులో భాగంగా పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.

🚗 * సిద్ధి అంబర్‌బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలి అనుకునే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు డైవర్ట్ చేస్తారు.

🚓 * పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ జిల్లా, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి బీజేఆర్‌(బషీర్‌బాగ్‌) జంక్షన్‌ నుంచి అబిడ్స్‌ వైపు మళ్లిస్తారు.

🚙 * ఇక బేగంబజార్‌ ఛత్రీ నుంచి మాలకుంటవైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు డైవర్ట్‌ చేస్తారు.

🚚 * గోషామహల్‌ రోడ్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లాలనుకునే వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు పంపిస్తారు.

🚗 * ఇక మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను సిటీ కళాశాల వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు డైవర్ట్‌ చేస్తారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page