top of page

🌾 న్యాయం చేయాలని మంత్రాలయలోకి దూసుకెళ్లిన రైతులు.. 🌾

మహారాష్ట్ర రైతులు కదం తొక్కారు. 🚜 ముంబైలో సెక్రటేరియట్‌ మంత్రాలయను ముట్టడించారు. 🏛️ మంత్రాలయలోకి దూసుకెళ్లారు రైతులు.. 🚜

భూసేకరణ పేరుతో తమ భూములను ప్రభుత్వం లాక్కుందని, సరైన పరిహారం ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. 🌱🏞️ మంత్రుల కార్యాలయాలను ముట్డడించారు. 🏢 వందలాదిమంది రైతులు మంత్రాలయ లోకి దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 🚨🗣️ రైతులను అడ్డుకోవడానికి పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. 👮‍♂️🛡️ కొందరు రైతులు సెక్రటేరియట్‌ లోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. 🚶‍♂️📉 అక్కడ సేఫ్టీ వలలు ఉండడంతో ప్రమాదం తప్పింది. ☠️ పోలీసులు చాలా మంది రైతులను అరెస్ట్‌ చేసి మెరైన్‌ డ్రైవ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 🚓🏨 సేఫ్టీ వలలో పడ్డ రైతులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కూడా కిందకు దూకారు. 🏠🔒

రైతుల సమస్యలను పరిష్కరించడంలో షిండే-ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కాంగ్రెస్‌, శివసేన ఉద్దవ్‌ వర్గం నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 💬👥 తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రైతులు మంత్రాలయను ముట్టడించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 🌾🏛️ రైతుల ఆందోళనకు తమ సంపూర్ఱ మద్దతు ఉంటుందన్నారు. 🤝💪

Comments


bottom of page